వినుకొండ నియోజకవర్గంలో కొందరు రైతులను టార్గెట్ చేస్తూ.. పంటలను తగలబెట్టడం కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఘటనలపై పోలీసులు దృష్టి పెట్టారు. నూజెండ్ల మండలం, ములకలూరులో మందా వెంకటేష్ అనే రైతు రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని మిరపపంట సాగు చేశాడు. అప్పులు చేసి మరీ పంట పండించాడు. పంట బాగా రావడంతో తన అప్పులన్నీ తీరిపోతాయని భావించాడు. తొలి కోతలోనే 30 క్వింటాల వరకు పంట వచ్చింది. కోసిన మిరప పంటను పొలంలోనే ఎండబోసాడు