పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఓ రీమేక్ మూవీ. ఆల్రడీ ఈ సినిమాని అన్ని భాషల్లో జనాలు చూసేశారు. అయితే పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు నిర్మాతలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, సినిమాకోసం మార్పులు చేర్పులు భారీగానే జరిగాయని. దీన్ని నిజం చేస్తూ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. కొత్త విషయాలు చెబుతున్నాడు.