ఢిల్లలోని యువకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.నగరంలో మద్యపానానికి చట్టబద్ధమైన వయస్సును దిల్లీ ప్రభుత్వం కుదించింది. గతంలో ఈ వయస్సు 25 ఏళ్లుగా ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు కుదిస్తున్నట్టు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీల్లీ కేబినెట్ కొత్త మద్యం పాలసీని ఆమోదించిందన్నారు. ఈ కొత్త విధానంలో ఆప్ సర్కార్ చేసిన పలు మార్పుల్లో భాగంగా వయస్సును కుదించారు. తక్కువ వయసు కలిగి ఉన్నా కూడా లిమిట్ లో తాగాలని పేర్కొంది.