తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న జిల్లాల్లో కృష్ణా జిల్లా కూడా ఒకటి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో జిల్లాలో మంచి ఫలితాలే రాబట్టింది. పైగా కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉండటం టీడీపీకి బాగా అడ్వాంటేజ్ ఉండేది. అయితే టీడీపీకి ఉన్న అడ్వాంటేజ్ 2019 ఎన్నికల్లోనే పోయింది. జిల్లాలో వైసీపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. కమ్మ సామాజికవర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో సైతం వైసీపీ విజయం సాధించింది.