ఏపీలో జగన్ హవా స్పష్టంగా నడుస్తోంది. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి, అద్భుతమైన పాలనతో దూసుకెళుతున్న జగన్కు తిరుగులేని విజయాలు అందుతున్నాయి. అసలు జగన్ మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకితతో ఉన్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో పస లేదని స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టమైపోయింది. ముందుగా పంచాయితీ ఎన్నికల్లో అదరగొట్టిన వైసీపీ, ఇటీవల మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటింది.