తిరుపతి ఉప ఎన్నికల వేళ.. టీటీడీపై కేంద్రం కొనసాగిస్తున్న పన్నుల విధానం ఆ పార్టీకి కష్టాలు కొనితెచ్చేలా ఉంది. దీనికి సంబంధించి రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేవనెత్తిన అంశాలు బీజేపీ చిత్తశుద్ధినే ప్రశ్నించేలా ఉన్నాయి. టీటీడీపై జీఎస్టీ విధించడం సరికాదని చెప్పిన విజయసాయిరెడ్డి, ప్రతి ఏడాదీ జీఎస్టీ వల్ల టీటీడీ 111 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతోందని, భక్తులపై ఆ మేరకు భారం పడుతోందని వివరించారు. టీటీడీకి జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరారు.