నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఓ క్లారిటీకీ వచ్చినట్టే కనపడుతోంది. చివరి నిముషంలో ఎలాంటి కొత్త ప్రతిపాదనలు రాకపోతే.. దాదాపుగా నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ పేరు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారట. అయితే బీజేపీ ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే దాని ప్రకారం తమ నిర్ణయాన్ని మార్చుకోడానికి టీఆర్ఎస్ టైమ్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.