ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ డైరెక్ట్ ఫైట్ కి దిగుతున్నట్టు కనిపిస్తోంది. అటు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా సహా.. విశాఖ ఉక్కు తదితర అంశాలపై కేంద్రాన్ని ఆ పార్టీ ఎంపీలు నిలదీస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలకు వైసీపీ సర్కారు మద్దతునిస్తోంది. తాజాగా ఈనెల 26న భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతివ్వడం చర్చనీయాంశం అయింది.