ఏపీలో మొన్ననే స్థానిక ఎన్నికలు ముగియడంతో ఒక్క సారిగా రాష్ట్రమంతా సునామీ వచ్చి పోయిన తరువాత సముద్రం ఎలా ఉంటుందో అలా ఉంది...అయితే ఆ తరువాత తిరుపతి ఎంపీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో మళ్లీ రాజకీయ వ్యూహాలలో మునిగిపోయారు. ఇదంతా ఇలా ఉండగా ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగిస్తుండడంతో కొత్త ఎన్నికల కమిషన్ ఎంపిక ప్రక్రియపై దృష్టి సారించింది..