కృష్ణా జిల్లాలో టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. ఈ నియోజకవర్గంలో ఎక్కువసార్లు టీడీపీ జెండా ఎగిరింది. అయితే ఈ సారి నుంచి ఆ పరిస్తితి ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే వరుసగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ...వైసీపీ వైపు వెళ్ళిపోయారు. టీడీపీని వీడి జగన్కు జై కొట్టారు. ఎప్పుడైతే వంశీ టీడీపీని వీడారో అప్పటినుంచి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ సత్తా తగ్గిపోయింది. టీడీపీ తరుపున మరో నాయకుడుని పెట్టినా కూడా పెద్దగా ప్రభావం కనిపించడం లేదు.