ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్ దెబ్బకు ప్రతిపక్ష టీడీపీ చుక్కలు చూస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభావం వల్ల టీడీపీ పుంజుకోవడం విషయం పక్కనపెడితే బ్రతికి బట్టగలుగుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లోనే జగన్ వేవ్‌లో టీడీపీ కొట్టుకుపోయింది. ఇక పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో చెప్పాల్సిన పని లేదు.