ఏపీలో జగన్ వేవ్ తట్టుకోవాలంటే చంద్రబాబు-పవన్‌లు కలవాల్సిందేనా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే కలిస్తేనే బెటర్ అనే అభిప్రాయం ఇటు టీడీపీ కార్యకర్తలు, అటు జనసేన కార్యకర్తల్లో వస్తుంది. 2014 ఎన్నికల్లో వీరు కలవడం వల్లే జగన్‌ని నిలువరించి విజయం సాధించగలిగారు. అయితే 2019 ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి, జగన్‌కు మరింత లబ్ది చేకూరింది. భారీగా సీట్లు వచ్చేశాయి.