అసలు పాలేరు పేరు ఎందుకు బయటకు వచ్చింది. ఆ నియోజకవర్గం విశిష్టత ఏంటి.. అంటే.. తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు ప్రభావం ఎక్కువగా ఉన్నది ఖమ్మం జిల్లాలోనే. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటుతో పాటు 3 అసెంబ్లీ సీట్లు ఈ జిల్లాలో వైసీపీ గెలుచుకుంది. ఆ తర్వాత జగన్ పూర్తిగా ఏపీకే పరిమితం కావడంతో వైసీపీ నాయకులు క్రమంగా టీఆర్ఎస్లో చేరిపోయారు. అందుకే ఇప్పుడు షర్మిళ ఖమ్మంపై కన్నేశారు.