ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఇన్నాళ్లూ ప్రజలంతా అనుకుంటున్నారు. హోదా ఇవ్వలేం, కావాలంటే ప్యాకేజీ తీసుకోండని అప్పటి టీడీపీ ప్రభుత్వానికి కేంద్రం ఓ ఆప్షన్ ఇచ్చిందని, దాని ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారనే ప్రచారం కూడా ఉంది. హోదాకోసం పట్టుబట్టకుండా ప్యాకేజీతో సరిపెట్టుకున్నారని చంద్రబాబుపై విమర్శలున్నా.. అది కూడా దక్కకపోతే ఏపీకి మరింత అన్యాయం జరిగేదని కూడా కొంతమంది సర్ది చెబుతుంటారు. ఈ దశలో అసలు ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబేనంటూ కుండబద్దలు కొట్టారు ఏపీ బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు.