మంత్రివర్గ కూర్పులోనే రెబల్స్ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు సీఎం జగన్. అలకల్ని, అసంతృప్తుల్ని లెక్కే చేయలేదు. అలాంటి జగన్, స్థానిక ఎన్నికల విషయంలో మాత్రం ఎందుకో కాస్త ఆలోచనలో పడ్డారు. స్థానిక ఎన్నికల అనంతరం పదవుల పంపకాల్లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏకంగా ఏపీ పురపాలక చట్టానికి సవరణలు చేశారు. ఈమేరకు ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. కొత్త సవరణలతో కార్పొరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లను, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో అదనపు వైస్ ఛైర్మన్లను ఎన్నుకునేందుకు ఈ ఆర్డినెన్స్ ఉపయోగపడుతుంది. తాజాగా ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ బిశ్వభూషన్ ఆమోదం తెలిపారు.