కరోనా వచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వ ఆస్పత్రులను కొవిడ్ ఆస్పత్రులుగా మార్చి... కొన్ని వార్డులను ప్రత్యేకంగా కొవిడ్ పేషెంట్లకు కేటాయించేవారు. గతేడాది జులై, ఆగస్ట్ నెలల్లో వైరస్ తీవ్రతను బట్టి ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి సుమారు 208 ఆస్పత్రుల్లో కోవిడ్ సేవలు అందించారు. వైరస్ ఉధృతి తగ్గిపోతున్న సమయంలో ఆస్పత్రుల సంఖ్యను తగ్గించారు. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను కూడా కుదించారు. ప్రస్తుతం ఏపీలో కేవలం 51 ఆస్పత్రుల్లో మాత్రమే కొవిడ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 5074 బెడ్లు కేవలం కొవిడ్ పేషెంట్లకు కేటాయించారు. అయితే కేసులు పెరుగుతున్న ఈ టైమ్ లో ఈ ఆస్పత్రులు కానీ, బెడ్స్ కానీ సరిపోవు. అందుకే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కొత్తగా పలు ఆస్పత్రులను కొవిడ్ పరిధిలోకి తీసుకొస్తోంది.