ఏపీలో అధికార, ప్రతిపక్షాలు మరో ఎన్నికల వార్కి సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఉప ఎన్నికలో కూడా అధికార వైసీపీ వన్ సైడ్ విక్టరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు 80 శాతం విజయాలని దక్కించుకుంది. ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓ అధికార పార్టీ ఈ రేంజ్లో విజయం సాధించడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు.