ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలు వైసీపీ నాయకులతో పోటీ పడుతున్నారని చెప్పడం కంటే, డైరక్ట్ జగన్నే ఢీకొడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీలో వన్ మ్యాన్ షో నడుస్తోంది. ఎన్నికలు ఏవైనా జనం కేవలం జగన్ని చూసే ఓటు వేస్తున్నారని గట్టిగా చెప్పొచ్చు. ఆయన అందించే సంక్షేమ పథకాల బట్టే వైసీపీకి ఓట్లు రాలుతున్నాయని చెప్పొచ్చు. అందుకే జగన్ ఇమేజ్ పెట్టుకునే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ బండి లాగ గలుగుతున్నారు.