ఏపీలో రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి అర్ధం కాదు. అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యూహాలు కూడా ఎవరికి అర్ధం కాకుండానే ఉంటాయి. అనేకసార్లు పార్టీలు, నియోజకవర్గాలు మారుస్తూ విజయాలు సాధిస్తూ వస్తున్న గంటా శ్రీనివాసరావు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గంటా చేసే పోరాటాన్ని రాజకీయ నాయకులు పెద్దగా నమ్మే పరిస్థితుల్లో కనబడటం లేదు.