ఏపీలో టీడీపీకి వైసీపీ ప్రధాన శత్రువుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీకి కనిపించే శత్రువు వైసీపీ అయితే, కనబడని శత్రువు జనసేన అని చెప్పొచ్చు. వైసీపీ వల్ల టీడీపీకి ఎలాంటి పరాజయాలు వస్తున్నాయో తెలిసిందే. అయితే జనసేన వల్ల పరోక్షంగా టీడీపీ చాలానే డ్యామేజ్ జరుగుతుంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావొచ్చు, తాజాగా జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి డ్యామేజ్ జరిగి వైసీపీకి బాగానే అడ్వాంటేజ్ వచ్చింది.