రత్నప్రభ ఐఏఎస్ అధికారిగా ప్రజలకు సేవలను అందించిన అపార అనుభవశాలి అని చెబుతున్న బీజేపీ ఆమె అనుభవం తిరుపతికి ఎంతో ఉపయుక్తం అవుతుందంటోంది. అయితే అభ్యర్థులు ఎవరైనా ఇక్కడ విజయం వైసీపీదే అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు తేలాల్సింది విజయం కాదని.. రెండో స్థానంలో ఎవరు నిలుస్తారు.. వైసీపీ ఎంత మెజారిటీ సాధిస్తుంది అన్నదే ప్రధానమని చెబుతున్నారు.