తిరుపతి ఉప ఎన్నికల భారమంతా పవన్ కల్యాణ్ పైనే పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అభ్యర్థి ఖరారు కాలేదు కాబట్టి.. పవన్ ఎక్కడా బయటకు రాలేదు. గతంలో జనసేన తరపున తిరుపతి పార్లమెంట్ పరిధిలో పార్టీ ఎంత పటిష్టంగా ఉందో తెలుసుకునేందుకు మాత్రమే ఆయన యాత్ర చేపట్టారు. ఆ తర్వాత జనంలోకి రాలేదు జనసేనాని. మళ్లీ ఇప్పుడు రత్నప్రభ ప్రచార పర్వంలో ఆయన కనపడతారని అంటున్నారు. బీజేపీ అధిష్టానం కూడా తిరుపతి ఎన్నికల్లో రత్నప్రభను గెలిపించే బాధ్యతను పవన్ కల్యాణ్ పై పెట్టిందని అంటున్నారు. సినిమాలతో బిజీగా ఉన్న వకీల్ సాబ్ కూడా.. ప్రత్యేకంగా కొన్ని రోజులు ప్రచారానికి కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది.