మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీ.. ప్రభుత్వాన్ని బీజేపీ ఇరుకున పెడుతుందా..? ఆ రాష్ట్ర అంతర్గత వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రపతి పాలనవైపు మొగ్గు చూపుతుందా..? ప్రస్తుతం వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ అనుమానాలు బలపడుతున్నాయి. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద కారులో పేలుడు పదార్థాల వ్యవహారంతో మొదలైన రాజకీయ రచ్చ.. చివరకు హోం మంత్రి వరకు చేరింది. హోం మంత్రి 100 కోట్ల ముడుపుల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సదరు హోం మంత్రి ఎన్సీపీ నాయకుడు కావడంతో.. శివసేన కూడా పట్టీ పట్టనట్టుగానే ఉంది. దీంతో బీజేపీ రెచ్చిపోతోంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తోంది.