ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఈ రెండు రాష్ట్రాలలో రాజకీయాలు చేయాలనుకునేవారు రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఎక్కడా నోరు జారకూడదు. అందుకే ఒకచోట అధికారంలో ఉండే పార్టీ, ఇంకోచోట ఆనవాళ్లు లేకుండా పోతోంది. తెలంగాణలో టీడీపీ క్రమక్రమంగా అడ్రస్ కోల్పోతోంది. వైసీపీ ఆల్రడీ తెలంగాణలో తమకు స్థానం లేదని గ్రహించేసి, పక్కకు వచ్చేసింది. జనసేన రెండుచోట్లా పాకులాడుతున్నా ఫలితం ఎలా ఉందో అందరికీ తెలుసు, బీజేపీది కూడా అదే దారి. తెలంగాణలో హవా చూపిస్తున్నా.. ఏపీలో అంత సీన్ లేదనే విషయం బీజేపీ నేతలకు కూడా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో అడుగు పెట్టిన వైఎస్ షర్మిల.. పార్టీ నిర్మాణంపై పక్కా స్కెచ్ తో ముందుకెళ్తున్నారు.