అసోం రాజకీయాల్లో తేయాకు తోటల్లో పనిచేసే లక్షలాది మంది కూలీల ఓట్లు చాలా ప్రధానం. ఎందుకంటే.. మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య దాదాపు ఐదో వంతు ఉంటుంది. అందుకే ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు టీ తోట వెంట పరుగులు తీశాయి. తేయాకు తోటల కూలీలపై హామీ వర్షం కురిపించాయి. తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు దాదాపు 40 నియోజకవర్గాల్లో కీలక పాత్ర పోషిస్తారు.