ఏపీలో ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా వైసీపీ డామినేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. పంచాయితీ ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ సంచలన విజయాలు దక్కించుకుంది. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు వైసీపీ వన్ సైడ్ విజయాలు సాధించింది. ఇక వైసీపీ వేవ్‌లో తెలుగు తమ్ముళ్ళు పూర్తిగా కొట్టుకుపోయారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిపోయిన టీడీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమితో మరింతగా ఇబ్బందుల్లో పడిపోయారు.