కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఇక్కడ ఏ పార్టీ పోటీలో ఉన్నా సరే గత నాలుగు పర్యాయాల నుంచి గెలుపు కొడాలిదే. రెండు సార్లు టీడీపీలో, రెండు సార్లు వైసీపీ నుంచి విజయం సాధించిన నాని, ఇప్పుడు మంత్రిగా దూసుకెళుతున్నారు. అయితే గుడివాడలో ప్రతిపక్ష పార్టీలు వీక్ గా ఉండటం నానికి బాగా కలిసొస్తుంది.