తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీకి గెలిచే సత్తా ఉందా? 2019 ఎన్నికల కంటే ఇప్పుడు మంచి ఫలితాన్ని రాబట్టగలుగుతుందా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే అసలు సాధ్యం కాదనే చెప్పొచ్చు. మామూలుగానే తిరుపతి పార్లమెంట్ స్థానంలో టీడీపీకి పెద్దగా గెలిచిన రికార్డు లేదు. పైగా వైసీపీ వరుసగా రెండు సార్లు గెలిచి ఉంది. ఇప్పుడు అధికారంలో ఉంది. జనంలో జగన్ పథకాల ప్రభావం బాగా ఉంది.