మొదటిసారి ఎమ్మెల్యేగా తిరుగులేని నాయకురాలుగా ఎదుగుతున్న విడదల రజినికి చిలకలూరిపేటలో ఇక చెక్ పెట్టడం కష్టమే అని తెలుస్తోంది. అయితే పేట టీడీపీకి కంచుకోట.  1983, 85, 89, 1999, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. ఇక 1994, 2004 ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే టీడీపీ గెలిచిన ఆరుసార్లో మూడు సార్లు ఆ పార్టీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు గెలిచారు. 1999, 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. 2004లో కేవలం 200 ఓట్ల తేడాతో మర్రి రాజశేఖర్‌పై ఓడిపోయారు.