పవన్ కల్యాణ్ ప్రచారానికి నో చెప్పేశారా? తిరుపతిలో అడుగు పెట్టేది లేదు, బీజేపీ తరపున ప్రచారం చేసేది లేదు అని తెగేసి చెప్పేశారా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది. రత్నప్రభ ఉమ్మడి అభ్యర్థిగా ఫైనల్ అయిన తర్వాత, పవన్ కల్యాణ్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ కూడా వేయలేదు. మిగతా అందరు నాయకులతో పాటు పవన్ పేరు మెన్షన్ చేస్తూ రత్నప్రభ ట్వీట్ చేసినా ఆయన స్పందించలేదు. పోనీ ఆ విషయం పక్కనపెడితే తాజాగా పవన్ కల్యాణ్ ని రత్నప్రభ కలసిన సందర్భంలో కూడా పవన్ ప్రచారంపై హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.