ఎంపీగా ఎన్నికైన నేతలు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తున్నారు. మన సమస్యలపై మాట్లాడుతున్నారా.. పల్లీబఠానీ తింటూ కాలక్షేపం చేస్తున్నారా... తెలుగు రాష్ట్రాల నుంచి 42 మందిని లోక్ సభకు పంపుతున్నాం. మరి వారిలో ఎందురు మన సమస్యలను ప్రస్తావిస్తున్నారు.. ఎందరు కేవలం ఎంపీ హోదా అనుభవిస్తూ రాచబోగాలు వెలగబెడుతున్నారు..?