తెలంగాణలో భూముల విలువ బాగా పెరిగిందని చెప్పడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆంధ్ర ప్రదేశ్ తో పోల్చారు. గతంలో ఆంధ్రలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో మూడు ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేదన్నారు... కాని ఇప్పుడు భిన్నమైన పరిస్థితి ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే.. ఏపీలో రెండు ఎకరాలు కొనుక్కోగలిగేలా ఇక్కడి భూములకు డిమాండ్ వచ్చిందని కెసిఆర్ అన్నారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ నేతలు మండిపడుతున్నారు.