తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పోరాటం పెద్ద సాహసమేనని చెప్పాలి. ప్రత్యేక హోదా విషయంపైనే కాకుండా.. ఇటీవల విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కూడా ఏపీ ప్రజలు కేంద్రంపై గుర్రుగా ఉన్నారు. ఈ దశలో బీజేపీ తిరుపతి ఉప ఎన్నికల బరిలో దిగి సత్తా చూపిస్తామంటోంది. కనీసం మిత్ర పక్షం జనసేనకు అవకాశమిచ్చినా పరిస్థితి మరో రకంగా ఉండేదని అంటున్నారు. అయితే బీజేపీ తన సత్తా ఎంతో తేల్చుకోవాలనుకునే ఈ సాహసం చేసిందని తెలుస్తోంది.