నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వ్యవహారం కాంగ్రెస్ కి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణలో ప్రతిపక్ష స్థానంలో ఉండాల్సిన కాంగ్రెస్, ఎమ్మెల్యేలను చేజార్చుకుని డీలా పడింది. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలలో వరుస ఓటములు కాంగ్రెస్ పార్టీని కుంగదీసింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో మరీ దారుణమైన ఫలితాలు రావడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతవడంతో తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి ఉందా లేదా అనే డౌట్ వస్తోంది. మరోవైపు షర్మిల కొత్త పార్టీతో కాంగ్రెస్ కే అధిక నష్టం ఉంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ దశలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే.. ఆ పార్టీకి తెలంగాణలో మనుగడ ఉంటుందనే మాట వాస్తవం.