తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సాక్షిగా పవన్ కల్యాణ్ పై పరోక్షంగా ఒత్తిడి పెంచుతోంది మిత్రపక్షం. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన సేవల్ని వినియోగించుకోవాలనుకుంటోంది. అయితే ఇప్పటి వరకు ఆయన ఎక్కడా తన ప్రచారంపై స్పందించలేదు. తిరుపతి వస్తానని కానీ, రాలేనని కానీ చెప్పలేదు. కనీసం రత్నప్రభకు ఓటు వేయండి అనే ప్రకటన కూడా ఇవ్వలేదు. అసలు పవన్ తిరుపతి ప్రచారానికి వస్తారా రారా అనేది అనుమానంగా మిగిలిపోయింది. దీంతో బీజేపీ ఎమోషనల్ బ్లాక్ మెయింలిగ్ కి దిగుతున్నట్టు తెలుస్తోంది.