ఇప్పటివరకూ అందుతున్న సమాచారం మేరకు మొత్తం ఖాళీలు 55 వేల కంటే ఎక్కువే ఉన్నాయి. గతంలో 50 వేలుగా అంచనా వేశారు. ఇటీవల పదోన్నతుల అనంతరం మరో అయిదువేల పోస్టులు కొత్తగా వచ్చి చేరాయి. ఉపాధ్యాయ పదోన్నతులు చేపడితే ఖాళీలు మరో అయిదువేలకు పైగా పెరుగుతాయి. ఇప్పటి వరకు వచ్చిన గణాంకాల మేరకు పోలీసుశాఖలో అత్యధికంగా, ఆ తర్వాత విద్య, వైద్యఆరోగ్య శాఖల్లో అధిక పోస్టులున్నాయట. అంతే కాదు.. రెవెన్యూ, పురపాలక, వ్యవసాయ, నీటిపారుదల శాఖల్లోనూ భారీగానే పోస్టు ఉన్నట్టు తెలుస్తోంది.