భారత్ కు టీకా పంపిణీ చేయడంలో హైదరాబాద్ దే కీలక పాత్ర, తెలంగాణ గడ్డపైనే టీకా తయారైంది, ఇది తమకు గర్వకారణం అని గతంలో గొప్పగా చెప్పారు తెలంగాణ నేతలు. అయితే టీకా పంపిణీలో మాత్రం ఎందుకో వెనకబడిపోయారు. తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కేంద్రం విధించిన టార్గెట్ కు, ఇప్పుడు టీకాలు వేస్తున్న సంఖ్యకు ఎక్కడా పొంతన లేదు. తెలంగాణలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి సుమారు కోటి మంది అర్హులుంటారని వైద్యఆరోగ్యశాఖ అంచనా. వీరందరికీ జులై 31నాటికి టీకా పంపిణీ చేయాలని టార్గెట్ పెట్టింది కేంద్రం. అయితే ప్రస్తుతం ఉన్న స్పీడ్ చూస్తే నవంబర్ అయినా టీకా తొలిదశ పంపిణీ పూర్తయ్యేలా లేదు.