కరోనా మహమ్మారి ఆ గ్రామాన్ని వణికిస్తోంది. ఐదు రోజుల వ్యవధిలో 21 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు ఈనెల 22న కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడపల్లి గ్రామానికి చెందిన ఒక విద్యార్థినికి పాజిటివ్‌గా తేలింది.