ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా నుండి కోలుకుని మళ్లీ సాధారణ జీవితానికి అలవాటు పడి పోయారు. అయితే ప్రపంచం ఉన్నంత కాలం మరియు మనుషులు బ్రతికి ఉన్నంత కాలం బ్రతకడానికి కనీస అవసరాలు ముఖ్యం. వాటిలో ఉద్యోగం అనేది కీలకమైనది. కాగా ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో స్థిరపడడానికి అవకాశం ఉండదు. కానీ ఎలాగోలా బ్రతకాలి కాబట్టి ఎవరి స్థాయికి తగినట్లుగా వారు చిన్న చిన్న ఉద్యోగాలతో తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ చాలా మందికి ఉద్యోగం అంత సులభంగా దొరకదు. ఎంతో మంది ఈ కరోనా వలన ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రస్తుతం తిరిగి పరిశ్రమలు మరియు సంస్థలు అన్నీ మొదలయ్యాయి. అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కోల్పోయిన వారిని భర్తీ చేయలేదు.h