తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరీకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన బుచ్చయ్య టీడీపీలో కీలక నాయకుడుగా ఎదిగారు. అయితే ఎన్టీఆర్‌ని గద్దె దింపే సమయంలో చంద్రబాబుతో వెళ్లకుండా ఎన్టీఆర్తోనే నడిచారు. అలాగే ఎన్టీఆర్ చనిపోయాక కూడా అన్న తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు.