ఏపీలో నిత్యం ప్రజల్లో ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అని ఠక్కున చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన గెలిచిన దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో రోజుకో ఊరు తిరుగుతూ, ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ, వాటిని వెంటనే పరిష్కరించడం గానీ, లేదా అధికారులకు చెప్పి త్వరగా పూర్తయ్యేలా చేస్తున్నారు.