కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారంలో ఉన్న బీజేపీ పరిస్తితి ఏపీలో ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏపీలో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవు. 2019 ఎన్నికల్లోనే బీజేపీ ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అలాగే బీజేపే కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇలా నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోలేకపోయిన బీజేపీ, ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో సత్తా చాటుతామని మాట్లాడుతుంది.