ఏపీలో వరుసగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 17న ఎన్నిక జరగనుండగా, మే 2న ఫలితం వెలువడనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ, తిరుపతి ఉప ఎన్నికపై కాన్ఫిడెంట్గా ఉంది. ఇక్కడ కూడా భారీ మెజారిటీతో గెలుస్తామని అంచనా వేస్తోంది.