తిరుపతి ఉప ఎన్నికల్లో మాటల యుద్ధం ముదురుతోంది. పనబాక లక్ష్మి నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ఎంపీలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీనికి వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అటు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కూడా వైసీపీ ఎంపీలు తోలుబొమ్మలంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం తిరుపతి బరిలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.