ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు చెక్ పెట్టి సత్తా చాటాలని చూస్తున్నారు. అందుకే తిరుపతి పోరులో వైసీపీ, టీడీపీలని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు.అలాగే ఆ రెండు పార్టీలు చేసే విమర్శలకు వెంటనే కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, బీజేపీ-జనసేనలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శలు చేశారు. పవన్ని సీఎం చేస్తామని చెప్పి వీర్రాజు జనాల చెవుల్లో క్యాబేజీ పువ్వులు పెట్టాలని చూస్తున్నారని సెటైర్లు వేశారు. ఇక దీనికి వీర్రాజు కూడా కౌంటర్ ఇచ్చారు.