కేశినేని శ్వేత....గత కొన్ని రోజులుగా విజయవాడ రాజకీయాల్లో హల్చల్ చేసిన పేరు. టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చిన శ్వేత ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు. తొలిసారి మేయర్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన శ్వేతకు నిరాశే ఎదురైంది.