ఏపీలో వరుసగా ఎన్నికల సమరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇక ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అలాగే బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించడంతో మరో ఉపఎన్నిక అనివార్యమైంది. అటు విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు.