ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో పార్టీ ఓటమి పాలైంది గానీ, ఈ స్థాయిలో మాత్రం గడ్డు పరిస్థితులు ఎదురుకోలేదు. 2019 నుంచి టీడీపీ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతూ వస్తుంది. అసలు ఆ ఎన్నికల్లోనే టీడీపీ దారుణంగా ఓడిపోయింది. జగన్ దెబ్బకు కేవలం 23 సీట్లే తెచ్చుకుంది.