గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలని ఆకర్షిస్తున్న నియోజకవర్గం ఏదైనా ఉందటే అది తాడిపత్రి నియోజకవర్గమే. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం జేసీ ఫ్యామిలీకి కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి జేసీ దివాకర్ రెడ్డి 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచే జేసీ ఈ విజయాలు అందుకున్నారు.