బెంగాల్లో అందరి కళ్లు నందిగ్రామ్ నియోజకవర్గంపైనే ఉన్నాయి. ఇక్కడ రెండో విడతలోనే పోలింగ్ ఉంది. ఈ నందిగ్రామ్‌లో టీఎంసీ తరఫున సీఎం మమత బెనర్జీ, బీజేపీ తరపున సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. మమత ఇక్కడ ఒక్కచోటే పోటీ చేస్తుండటం గమనార్హం.